తక్షణమే వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ పెద్దాపురం తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా.
తక్షణమే వీఆర్ఏలకు పే స్కేల్ అలా చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ పెద్దాపురం తాసిల్దార్ కార్యాలయం ఎదుట గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. గత వైసిపి ప్రభుత్వం గ్రామ రెవెన్యూ సహాయకుల కోర్కెలను తీర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీఆర్ఏలకు తగిన న్యాయం చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరికి పదోన్నతి కల్పించి వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు.వెట్టి చాకిరి చేస్తున్న కనీసం గౌరవం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.