వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ముమ్మిడివరం నియోజకవర్గ నాయకులు పితాని బాలకృష్ణ నియామకం
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ముమ్మిడివరం నియోజకవర్గ నాయకులు పితాని బాలకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర నాయకత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డికి బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. అంకిత భావంతో పని చేసి, సీఎం జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు. కాగా బాలకృష్ణ ఇటీవలే జనసేన నుంచి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే.