శ్రీశైలం: రిజిస్ట్రేషన్ స్టాంప్ల శాఖ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆత్మకూరు పట్టణంలో దస్తావేజు లేఖరుల నిరవధిక సమ్మె
రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ప్రైవేటీకరణను నిదర్శిస్తూ ఆత్మకూరు పట్టణంలో దస్తావేజు లేఖరుల నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు. సోమవారం ఆత్మకూరు పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖరులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రిజిస్ట్రేషన్ స్టాంప్ల శాఖ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి, జీవో ఎం,ఎస్, నంబర్ 396 రద్దు చేయాలి. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు ఉపసంహరించుకోవాలి.ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలి .దస్తావేజు లేకరులు, స్టాంప్ వెండర్ల ,డిటి ఆపరేటర్ల జీవనోపాధిని కాపాడాలని డిమాండ్ చేశారు ఈ నిరవధిక సమ్మె ఈనెల 31 వరకు కొనసాగుతుందని తెలియజేశారు.