అమలాపురం: అమలాపురం ఈదరపల్లిలో కలకలం: ఇంట్లోకి దూరిన 5 అడుగుల గోధుమ త్రాచు పాము
అమలాపురం పరిధిలోని ఈదరపల్లిలో గురువారం ఒక ఇంట్లోకి ఐదు అడుగుల గోధుమ త్రాచు పాము ప్రవేశించింది. స్థానికుల సమాచారంతో స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ అక్కడికి చేరుకుని, ఎంతో చాకచక్యంగా పామును బంధించి సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టారు.