ప్రత్తిపాడు: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు భవానీ భక్తులు మృతి
కాకినాడ జిల్లా కత్తిపూడి జాతీయ రహదారిపై రోడ్డు దాటుతుండగా స్కార్పియో వాహనం ఢీకొనడంతో నలుగురు భవానీ భక్తులు మృతి చెందారు. డెంకాడ నుండి విజయవాడ వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.