విశాఖపట్నం: విశాఖలో పలు ప్రాంతాలలో సిసి కెమెరాల పర్యవేక్షణ AMC నుండి గుత్తేదారులు తప్పుకోవడంతో బోసిపోయిన కూడళ్ళు.
పట్టణ ప్రధాన కూడళ్లు, రహదారు లపై నిరంతరం నిఘా ఉంచే సీసీ కెమెరాలను సంబందిత గుత్తేదారు సంస్థ తొలగించడంతో స్తంభాలు అలంకారప్రాయంగా మారాయి. ఆయా చోట్ల నేరాలు, ఘోరాలు జరిగితే వీటి ఆధారంగా కేసులను పర్యవేక్షించే పోలీసులకు ఇప్పుడు తగిన ఆధారాలు దొరకని పరిస్థితి ఎదురైంది. అయిదేళ్లక్రితం విశాఖ నగర వ్యాప్తంగా 530 వరకూ సీసీ కెమెరాలను ఒక ప్రైవేటు సంస్థ సహకారంతో పోలీసుశాఖ' ఏర్పాటు చేసింది.ముఖ్యంగా గాజువాక సౌత్ సర్కిల్ పరిధిలో 120 వరకూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఒక్క జాతీయ రహదారి పాతగాజుగా కూడలిలోనే నాలుగు వైపులా పది వరకూ కెమెరాలను కొత్తగాజువాక, చినగంట్యాడ,లలో ఉన్నాయి.