నంద్యాల జిల్లా ఓర్వకల్లు మండలం సోమయాజుల పల్లె నుంచి బేతంచెర్ల మండలం మీదుగా డోన్ వరకు 340b జాతీయ రహదారి నిర్మాణ పనులు రూ.650 కోట్లతో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రహదారి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతుండగా.. ఆర్ఎస్ రంగాపురం రైల్వే గేట్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు సాగుతున్నాయి. దీంతోపాటు ఆర్.కొత్తపల్లి గ్రామం వద్ద టోల్‌గేట్‌ను ఏర్పాటు చేశారు.