శ్రీశైలం: మహానంది క్షేత్రంలోని కరివేన సత్రం వద్ద స్కూటీ డూమ్ లో దొరికిన కొండచిలువ
మహానంది ఆలయ సమీపంలోని కరివేన సత్రం వద్ద శుక్రవారం కొండచిలువ సంచారం భక్తులను భయాందోళనకు గురి చేసింది. సత్రం వద్ద నిలిపి ఉంచిన ఓ స్కూటీలోకి కొండచిలువ దూరడంతో అక్కడ ఉన్న భక్తులు, స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.వెంటనే స్థానికులు స్నేక్ క్యాచర్ మోహన్‌కు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న మోహన్ చాకచక్యంగా కొండచిలువను సురక్షితంగా పట్టుకుని సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.కొండచిలువను ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా తొలగించడంతో భక్తులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.