పామూరు పట్టణంలోని బిజెపి కార్యాలయంలో స్వామి వివేకానంద జయంతి కార్యక్రమాన్ని బిజెపి నాయకులు, కార్యకర్తలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కనిగిరి నియోజకవర్గం బిజెపి మాజీ కన్వీనర్ కొండిశెట్టి వెంకటరమణయ్య, బిజెపి జిల్లా నాయకులు విజయ్ కుమార్ చారి స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేలా వివేకానందుని బోధనలు దోహదం చేశాయన్నారు. యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన స్వామి వివేకానంద ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారు అన్నారు.