గుంటూరు: పీకల వాగు ఉప్పొంగి వర్షపు నీరు రోడ్లపైకి చేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు: గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్
Guntur, Guntur | Sep 15, 2025 గుంటూరులోని పీకల వాగు ఉప్పొంగి వర్షపు నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ పరిస్థితిని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ సోమవారం స్వయంగా పరిశీలించారు. రోడ్డు, డ్రైనేజీ పనులను సరిగ్గా చేయకుండా నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్ల బిల్లులను నిలిపివేయాలని మున్సిపల్ కమిషనరు కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అక్కడి పరిస్థితులను ఆయన వీడియో కాల్ ద్వారా సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పనులను వెంటనే పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు.