శ్రీశైలం: మహానంది మండలం గోపవరం గ్రామం వద్ద రైలు కిందపడి మదన్ అనే యువకుడు ఆత్మహత్య
మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన ముత్త తిమ్మనాయుడు కుమారుడు ముత్త మదన్. స్థానిక రైల్వే పట్టాలపై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మదన్ వయస్సు సుమారు 27 సంవత్సరాలు ఉంటుంది. బీసీ కాలనీలో నివసించే ఈ యువకుడు ఉన్నట్టుండి ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.మదన్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు