గన్నవరం: ఉంగుటూరు మండలంలో రూ. 3.05 కోట్లతో రహదారి పనులు ప్రారంభం
కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలో 'పల్లె పండుగ 3.0'లో భాగంగా రూ. 3.05 కోట్ల అంచనా వ్యయంతో ఏడు రహదారి పనులకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో మౌలిక వసతులు, యువతకు ఉపాధి, శిక్షణ అవకాశాలపై ఎమ్మెల్యే వివరించారు.