సామర్లకోట రైల్వే స్టేషన్ నందు స్టేషన్ మేనేజర్ ఎం రమేష్ ఆధ్వర్యంలో, స్వచ్ఛతాహి సేవ 2025 కార్యక్రమం నిర్వహించారు
కాకినాడ జిల్లా సామర్లకోట పట్నం స్థానిక రైల్వే స్టేషన్ నందు,స్టేషన్ మేనేజర్ ఎం రమేష్ ఆధ్వర్యంలో స్వచ్ఛతాహి సేవ 2025 కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇతర రైల్వే సిబ్బందితో కలిసి రైల్వే స్టేషన్ ప్రాంగణం నందు ర్యాలీ నిర్వహించారు అనంతరం స్వచ్ఛత ఈ సేవ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రత, పై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్, బి శివప్రసాద్ హెల్త్ ఇన్స్పెక్టర్ కళ్యాణి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె.వి గిరి, ఆర్ పి ఎఫ్ ఎస్ ఐ చైతన్య, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.