ఇబ్రహీంపట్నం: ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 3.8 కిలోల గంజాయి చాక్లెట్లను పట్టుకున్నట్టు తెలిపిన సీపీ సుధీర్ బాబు
రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం రాచకొండ సిపి సుధీర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 3.8 కిలోల గంజాయి చాక్లెట్లను సీజ్ చేసినట్లు తెలిపారు. ఇద్దరినీ అరెస్టు చేశామని తెలిపారు. నిందితులు సులువుగా డబ్బులు సంపాదించడం కోసం బీహార్ నుంచి గంజాయి చాక్లెట్లను తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారని తెలిపారు.