మండపేట: కపిలేశ్వరపురంలో గోదావరిలో స్థానానికి దిగి ప్రమాదవశాత్తు మునిగి మండపేట కు చెందిన యువకుడు మృతి..
గౌతమిగోదావరి నదిలో ఐదుగురు యువకులు స్నానానికి దిగి ప్రమాదవశాస్తూ గోదావరిలో ఒక యువకుడు మునిగిపోయి మృతి చెందిన సంఘటన మంగళవారం కపిలేశ్వరపురం లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండపేట కు చెందిన యండ్రు మురళీకృష్ణ( 20 ) సంవత్సరాల యువకుడు విజ్ఞాన్ కాలేజీలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి మంగళవారం మధ్యాహ్నం కపిలేశ్వరపురం గోదావరిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. సదరు విషయమై ఆ యువకుడు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.