శ్రీశైలం: వెలుగోడు పట్టణ శివారులో ఆవుల మండపై పెద్దపులి దాడి. ఒక ఆవు మృతి
వెలుగోడు శివారులోని నల్లమల అటవీ సమీప ప్రాంతంలోని గట్టుతండా వద్ద సోమవారం అర్ధరాత్రి ఓఆవుల మందపై పులి దాడి చేసి ఆవును చంపిన సం ఘటన చోటుచేసుకొంది. గట్టుతం డాలోని రెడ్యానా యక్' చెందిన ఆవుల మంద బొందులకుంట పొ లాల్లో ఉంది. ఈ పొలం అటవీ ప్రాంతానికి సమీపంలో ఉం డటంతో సోమవారం అర్ధరాత్రి ఓ పులి ఆవులమందపై దాడి చేసింది. ఆవులు బెదిరి గట్టిగా అరుస్తుండటంతో అక్కడున్న కాపరులు స్వామి నాయక్, కుమార్నాయక్, మనోజ్నాయక్ అక్కడికి చేరుకునే లోపు పులి దాడి చేస్తుంది. వారు కేకలు వేయడంతో అక్కడి నుంచి అడవి లోకి వెళ్లిపోయింది. ఈదాడిలో ఓఆవు మృతి చెందింది.