చెన్నూరు: గంటలో 180 సూర్య నమస్కారాలు చేసి యోగా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి చేరిన యోగా గురువు మద్ది శంకర్
యోగా గురువు సాధకుడు మద్ది శంకర్ ఒక గంటలో 180 సూర్య నమస్కారాలు చేసి యోగా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి నమోదయ్యారు. మందమర్రి పట్టణంలో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగా బుక్ ఆఫ్ రికార్డ్స్ వేదికపై ఒక్క గంటలో 180 సూర్య నమస్కారాలు యోగాసనాలు వేసి చూపించి యోగ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు ఎక్కడం గొప్ప విషయమని హాజరైన పెద్దలు తెలిపారు. మద్ది శంకర్ యోగాను విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడమే ధ్యేయంగా పెట్టుకొని యోగ ప్రాముఖ్యతను తెలుపుతూ యోగ మనిషి జీవితాన్ని మార్చి వేస్తుందని ఆరోగ్యంతో పాటు మానసిక స్థిరత్వం శక్తి లభిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా యోగా గురువు మద్ది శంకరును అభినందించారు.