వికారాబాద్: ఏకో టూరిజం హబ్‌గా అనంతగిరి కొండలు, ఏకో టూరిజం అభివృద్ధికి రూ.137.92 కోట్లను కేటాయించిన కేంద్ర ప్రభుత్వం
వికారాబాద్ జిల్లా కేంద్రానికి అతి చేరువలో ఉన్న అనంతగిరి కొండలను కేంద్ర ప్రభుత్వం 18.85 ఎకరాల్లో ఏకైక టూరిజం హబ్‌గా అభివృద్ధి చేసేందుకు ఇటీవల ప్రధానమంత్రి మోదీ వర్చువల్‌గా పనులను ప్రారంభించారు. ఇందుకుగాను ఏకో టూరిజం అభివృద్ధికి రూ.137.92 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ పనులు పూర్తయితే వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరి కొండలోయలు ఆహ్లాదకర వాతావరణంలో పర్యాటకంలో మంత్రముగ్ధులను చేయనున్నాయి. పర్యాటకులు ఇంతకింతకు పెరిగి వికారాబాద్ జిల్లా టూరిజం హబ్‌గా మారనుంది.