పూతలపట్టు: పేటమిట్ట మంగళ్ విద్యాలయంలో 263 మంది విద్యార్థులకు 80 లక్షల స్కాలర్షిప్లు
పూతలపట్టు మండలం పేటమిట్టలోని మంగళ్ విద్యాలయంలో శ్రీకృష్ణదేవరాయ విద్యా సాంస్కృతిక సంఘం 51వ వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా పదో తరగతి నుంచి సీఏ వరకు వివిధ కోర్సుల్లో ప్రతిభ కనబరిచిన 263 మంది విద్యార్థులకు 80 లక్షల రూపాయల విలువైన ఉపకార వేతనాలను అందజేశారు.