విశాఖపట్నం: ఆర్టీసి అదనపు బస్సులు పెంపుకు చర్యలు తీసుకొని,ప్రయాణీకుల కష్టాలు తీర్చాలి. CPM జిల్లా కార్యదర్శి ఎం జగ్గు నాయుడు
విశాఖ జిల్లాలో ప్రయాణికుల కు తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచి, ప్రజల అష్ట కష్టాలను తీర్చాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గు నాయుడు డిమాండ్ చేశారు.సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్కే ఎస్ వి కుమార్,వి.క్రిష్ణారావులతో కలిసి ప్రెస్ మీట్ మంగళవారం నిర్వహించారు.ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పధకం పేరుతో మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. సిపిఎం పార్టీ దీనిని స్వాగతిస్తున్నది. అయితే ప్రస్తుత బస్సులతోనే ఈ పధకం అమలు చేయడం వలన ప్రయాణీకులు సీనియర్ సిటిజన్లు, అవస్థలు పాలవుతున్నారన్నారు