ప్రజా సమస్యల పరిష్కారంలో, అధికారులు ప్రధాన భూమిక పోషించాలి, పెద్దాపురం సర్వ సభ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజప్ప.
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రధాన భూమిక పోషించాలని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు కాకినాడ జిల్లా పెద్దాపురం మండల పరిషత్ కార్యాలయంనందు సోమవారం ఉదయం 10.30ని నుండి సర్వసభ్య సమావేశం ఎంపీపీ పెంకె సత్యవతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ విభాగాల అధికారులు శాఖా పరంగా తీసుకుంటున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై నివేదిక అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ, నిరంతరం ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారంలో తమదైనా ముద్ర వేసుకోవాలని కోరారు.ఈ సమావేశంలోDCCB చైర్మన్ తుమ్మల రామస్వామి,MPDO శ్రీ లలిత తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.