గన్నవరం: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న సాత్విక్ సాయిరాజ్
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, ఖేల్ రత్న అవార్డు గ్రహీత సాత్విక్ సాయిరాజ్ శనివారం అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు ఆయనను సత్కరించారు.