ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు శివ సర్కిల్లో ఓ షాపింగ్ మాల్‌ను హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రారంభించారు.. చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు..
ఎమ్మిగనూరులో హీరోయిన్ నిధి అగర్వాల్ సందడి..ఎమ్మిగనూరు శివ సర్కిల్లో ఓ షాపింగ్ మాల్‌ను హీరోయిన్ నిధి అగర్వాల్ గురువారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. సినీ హీరో పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' చిత్రంలో నటించడంతో చాలా అవకాశాలు వస్తున్నాయన్నారు. 'రాజాసాబ్' చిత్రంలో నటిస్తున్నానని తెలిపారు. తాను తెలుగు అమ్మాయి కావడంతో తెలుగు సినిమాల్లో నటించేందుకే మొదటి ప్రాధాన్యత ఇస్తానన్నారు.