గుంతకల్లు నియోజకవర్గంలోని మూడు మండలాలలో ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ అన్నారు. అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని తొండపాడు గ్రామంలో మాఘమాసాన్ని పురస్కరించుకుని ఈనెల 26వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరిగే బొలికొండ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి మంగళవారం ఆలయ ఆవరణలో అధికారాలతో ఎమ్మెల్యే సమీక్ష, సమావేశం నిర్వహించారు. ముందుగా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో రూ.8 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే, ఆయన తనయుడు టీడీపీ ఇంచార్జి గుమ్మనూరు ఈశ్వర్ తో కలిసి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.