శ్రీశైలం: శ్రీశైలం మండలం సుండిపెంటలో పనిచేస్తున్న ANM భారతి బదిలీ వివాదం. భారతి తల్లి ఆత్మహత్యయత్నం
శ్రీశైలం మండలం సుండిపెంటలో పనిచేస్తున్న ANM భారతి బదిలీ వివాదాస్పదంగా మారింది. స్థానిక కూటమి నేతల ఒత్తిడితోనే భారతి బదిలీ జరిగిందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన భారతి తల్లి సులోచనఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే ఆమెను సుండిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు వెల్లడించారు.ఇదిలా ఉండగా, చిన్న పిల్లలను పెట్టుకుని సుదూర ప్రాంతమైన రెంతచింతలకు ఎలా వెళ్లాలని ANM భారతి ఆవేదన వ్యక్తం చేశారు.