జిన్నారం: జిన్నారంలో అట్టహాసంగా అమ్మవారి శోభాయాత్ర.. చీరల వేలంలో భక్తుల సందడి
జిన్నారం మున్సిపల్ కేంద్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. అమ్మవారి శోభాయాత్రతో పాటు, తొమ్మిది రోజుల పాటు అలంకరించిన చీరల వేలాన్ని నిర్వహించారు. ఈ వేలంలో భక్తులు పోటాపోటీగా పాల్గొని అమ్మవారి చీరలను సొంతం చేసుకున్నారు.