కర్నూలు: మహిళల ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడితే ఉపేక్షించమన్న కర్నూలు మహిళలు
మహిళల ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడితే ఉపేక్షించబోమని మహిళలు వసుంధర, శైలజ, జయ లక్ష్మి అన్నారు. మంగళవారం కల్లూరులో పెద్దఎత్తున ఆందోళన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నాయకులు ఇలాగే మాట్లాడితే భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఒక్క సీటు కుడా గెలువదన్నారు. మహిళల ఆత్మగౌరవం కాపాడి సాక్షి మీడియాను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.