పూతలపట్టు: పేటమిట్ట మంగళ్ విద్యాలయంలో 263 మంది విద్యార్థులకు రూ. 80 లక్షల ఉపకార వేతనాలు
పూతలపట్టు మండలం పేటమిట్టలోని మంగళ్ విద్యాలయంలో శ్రీకృష్ణదేవరాయ విద్యా సాంస్కృతిక సంఘం 51వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. వివిధ కోర్సుల్లో ప్రతిభ కనబరిచిన 263 మంది విద్యార్థులకు రూ. 80 లక్షల ఉపకార వేతనాలను అందజేశారు. గల్లా రామచంద్ర నాయుడు, డా. పి. కృష్ణయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.