జమ్మికుంట: జమ్మికుంట విజయలక్ష్మీ జువెలరీలో అగ్నిప్రమాదం: షార్ట్ సర్క్యూట్ కారణమని అనుమానం
కరీంనగర్ జిల్లా జమ్మికుంట గాంధీ చౌరస్తాలోని విజయలక్ష్మీ జువెలరీ షాపులో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.