మండపేట: శ్రీరామ నవమినాడు భద్రాచలంలో జరిగే రాములోరి కల్యాణానికి మండపేట నుండి తరలి వెళ్లనున్న కొబ్బరి బొండాలు..
భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణ వేడుకలో వినియోగించే కొబ్బరి బొండాలు మండపేట నుంచి సోమవారం రాత్రి తరలనున్నాయి. రంగులు అద్ది,రంగురంగుల రాళ్లుతో అలంకరించిన బొండాలు శ్రీ సీతారాముల వివాహ వేడుకలో వారిపాదాల చెంత ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. కోనసీమ జిల్లా మండపేటకు చెందిన కాజులూరి వెంకట అచ్యుతరామారెడ్డి, మహాలక్ష్మి దంపతులు 24 ఏళ్ల నుంచి కొబ్బరి బొండాలను ప్రత్యేకంగా అలంకరించి స్వామివారి కళ్యాణానికి కానుకగా అందజేస్తున్నారు.