జమ్మికుంట: జమ్మికుంట హుజురాబాద్ మున్సిపాలిటీలకు 30 కోట్లు నిధులు కేటాయించిన ప్రభుత్వం MLA కౌశిక్ తెచ్చాననడం సిగ్గుచేటు MLC బల్మూరి
జమ్మికుంట: పట్టణంలో టిపిసిసి ఉపాధ్యక్షుడు,ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ శుక్రవారం మధ్యాహ్నం పర్యటించారు. ఈ సందర్భంగా హుజరాబాద్ జమ్మికుంట మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం 30 కోట్లు నిధులు మంజూరు చేసిందని, నా వల్లనే నిధులు వచ్చాయని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. హుజురాబాద్ ప్రజల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వానికి నివేదించాలి కానీ, నేనే తెచ్చాను అనే పద్ధతి మార్చుకోవాలని, లేనిపక్షంలో ప్రజల తిరుగుబాటుతో తరిమికొడతారని హెచ్చరించారు