ముధోల్: ముధోల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
తానూర్ మండలం బొంద్రేడ్ గ్రామంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు, అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను పంపిణీ చేశారు. మండలంలోని రహదారి నిర్మాణాలు మరియు 28వ ప్యాకేజీపై ఎమ్మెల్యే కీలక హామీలు ఇచ్చారు.