శ్రీశైలం: విద్యుత్ బస్సులను ఆర్టీసీ నే నిర్వహించాలని ఆత్మకూరు ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల ధర్నా
నంద్యాల జిల్లా ఆత్మకూరులో APSRTC JAC పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులు బస్టాండ్ వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. పినాకిల్ కంపెనీతో ఒప్పందాలను రద్దు చేయాలని, విద్యుత్ బస్సులను ఆర్టీసీయే నేరుగా నిర్వహించాలని కార్మికులు డిమాండ్ చేశారు. అలాగే మూసివేసిన డిపోలను వెంటనే పునఃప్రారంభించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తూ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని, ఆర్టీసీ యాజమాన్యాన్ని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్మికులు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.