కర్నూలు: సిఐటియు అఖిల భారత మహాసభల విజయానికి సంఘీభావంగా కర్నూల్ లో నిధి సేకరణ
సిఐటియు అఖిల భారత మహాసభల విజయానికి సంఘీభావంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కర్నూలులో నిధి సేకరణ చేపట్టింది. సి క్యాంపు లలిత కళా సమితిలో నిర్వహించిన కార్యక్రమంలో రూ.18,700 విరాళాలు సేకరించినట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, కార్మిక–కర్షక ఐక్యత కోసం రాష్ట్రవ్యాప్తంగా నిధి సేకరణ కొనసాగుతున్నదని చెప్పారు. విశాఖపట్నంలో డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు జరగనున్న అఖిల భారత మహాసభలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.