ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లావ్యాప్తంగా డ్రంక్&డ్రైవ్ పరీక్షలు నిర్వహించిన పోలీసులు, కేసులు నమోదు
Ongole Urban, Prakasam | Aug 2, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆదివారం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. మద్యం తాగి వాహనం నడుపుతున్న వాహనదారులపై అధికారులు కేసు నమోదు చేశారు. మద్యం తాగి వాహనం నడిపితే భారీ జరిమానా తో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని వాహనదారులను పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ఆదివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు అధికారులు అన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపి శిక్షకు గురి కావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.