అనంతపురం జిల్లా బెళుగుప్ప మండల కేంద్రంలో కోతుల బెడద అధికంగా ఉండటంతో గ్రామస్తులతో కలిసి పంచాయతీ అధికారులు చర్యలు బుధవారం చేపట్టారు. గత కొన్ని నెలలుగా గ్రామంలో వ్యవసాయ తోటలు పొలాలతో పాటు దుకాణాలు ఇళ్లపై దాడులు చేస్తున్న కోతులను నివారించెందుకు చిత్తూరు జిల్లా ఓటేరు గ్రామానికి చెందిన కోతులు పట్టే వారిని బెలుగుప్పకు రప్పించి బోనులను ఏర్పాటు చేశారు. పదుల సంఖ్యలో కోతులను బోను ల్లో కి చేర్చారు. అటవీ ప్రాంతాల వద్ద ఆహారం లభ్యమయ్యే ప్రాంతాల్లో కోతులను వదిలిపెట్టడం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.