అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతాపల్లి గ్రామంలో మూఢ నమ్మకాలతో తనపై చేతబడి చేశాడని రామాంజనేయులు అనే వ్యక్తి ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన శ్రీనివాసులు అనే వ్యక్తిని గుత్తి పోలీసులు అరెస్ట్ చేశారు. గుత్తి పట్టణంలోని స్థానిక పోలీసు స్టేషన్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రామారావు అరెస్ట్ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఈ నెల 16న చాకలి శ్రీనివాసులు అలియాస్ శీన రామాంజనేయులు ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో లక్ష్మీ తీవ్రంగా గాయపడింది.