అశ్వారావుపేట: గిరిజన ఆశ్రమ పాఠశాలలో హాస్టల్లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్స్ చేస్తున్న సమ్మెకు దమ్మపేటలో సంఘీభావం తెలిపిన BRSశ్రేణులు
రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలు,హాస్టల్స్ లో పనిచేస్తున్న డైలివేజ్ వర్కర్స్ ను పర్మినెంట్ చేయాలని,పాత పద్ధతిలోనే జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించాలని,పెండింగ్ లో ఉన్న వేతనాలు,కొత్త మెనూ వల్ల పెరిగిన పనిభారానికి అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని అనేక మార్లు స్థానిక ఎమ్మెల్యే,మంత్రుల వరకు వెళ్లి కోరినా స్పందించకపోవడంతో సమస్యలు పరిష్కరించాలని నిరవధిక సమ్మె చేస్తున్నారు.దమ్మపేట పార్కలగండి,అశ్వారావుపేట నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్,మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మండల బిఆర్ఎస్ నాయకులతో కలిసి వెళ్లి మంగళవారం వారికి సంఘీభావం తెలిపారు