జమ్మికుంట: పట్టణంలో 6వ వార్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ 21వ వార్డు మేదరి వాడలో వైభవంగా కొలువుదీరిన దుర్గామాత అమ్మవారు
జమ్మికుంట: పట్టణంలోని 6వ వార్స్ హౌసింగ్ బోర్డ్ కాలనీ,21వ వార్డ్ మెదరివాడలో సోమవారం సాయంత్రం దుర్గామాత ను మండపంలో ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. నవరాత్రులు పురస్కరించుకొని అమ్మవారు తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకొని దుర్గామాతకు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సోమవారం దుర్గామాత అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రసాదాచార్యులు మాట్లాడుతూ తొమ్మిది రోజులపాటు 9 రకాల అవతారాల రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని తెలిపారు.