శ్రీశైలం: శ్రీశైలం దేవస్థానంలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగా శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఈవో శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగా శిక్షణా కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. చంద్రవతి కల్యాణమండపంలో నిర్వహించిన ఈ శిక్షణలో సుమారు 500 మంది పాల్గొన్నారు. ఈ నెల 8న గంగాధర మండపం వద్ద ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఈవో ఎం. శ్రీనివాసరావు తెలిపారు. అలాగే జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రముఖ యోగా గురువు గంధవళ్ళ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ధ్యానం, ప్రాణాయామాలు, యోగాసనాలపై శిక్షణ అందించారు. స్థానికులు, యాత్రికులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా కార్యక్రమాలను విజయవంతం చేయాలని దేవస్థానం కోరింది.