అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని బాచుపల్లి గ్రామంలో భూతగాదా విషయంలో నూర్ భాషా అనే వ్యక్తిపై కొందరు దాడి చేశారు. శుక్రవారం బాధితుడు నూర్ భాషా తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుత్తి మండలం బాచుపల్లి గ్రామంలో నూర్ బాష అనే వ్యక్తికి భూములు ఉన్నాయి. అయితే పక్క పొలం రైతులతో భూమి గురించి గొడవలు ఉండేవి. ఈ క్రమంలో ఇద్దరు రైతులు భూముల సర్వే కోరారు. ఈ నేపథ్యంలో మండల రెవెన్యూ అధికారులు, సర్వేయర్ గ్రామంలో భూముల సర్వేకి వచ్చారు. దీంతో చిన్నపాటి విషయంపై గ్రామస్తులు కొందరితో నూర్ బాషకు గొడవ జరిగి పరస్పరం దాడులు చేసుకున్నారు.