నేరేడుగొమ్ము: ధర్మారేఖ్య తండాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్, ఆ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరిన 100 మంది కార్యకర్తలు
నల్గొండ జిల్లా, నేరేడుగొమ్ము మండలం, ధర్మారేఖ్య తండాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆదివారం సాయంత్రం 100 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం రవీంద్ర కుమార్ మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అధికారం కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పాత వారితో సమానంగా కొత్తవారికి ప్రాధాన్యత ఉంటుందని, పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కోరారు.