నల్గొండ: రానున్న 10 నెలలు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలి: కలెక్టర్ బి.చంద్రశేఖర్
దేవరకొండలో ఎల్ నినో ప్రభావంపై నిర్వహించిన సదస్సులో కలెక్టర్ బి.చంద్రశేఖర్ పాల్గొన్నారు. గ్రామాల్లో తాగునీటి వృధాను అరికట్టి, జూలై వరకు నీటిని పొదుపుగా వినియోగించాలని, ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని సర్పంచులకు, గ్రామ కార్యదర్శులకు దిశానిర్దేశం చేశారు.