శ్రీశైలం: ఆత్మకూరు మండలం సిద్దాపురం చెరువు కట్ట సమీపంలో ట్రాక్టర్ ఢీకొన్న గుర్తు తెలియని వాహనం రైతుకు గాయాలు
ఆత్మకూరు మండలం సిద్దాపురం చెరువు కట్ట సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమల నాయక్ తీవ్రంగా గాయపడ్డారు. గుర్తు తెలియని వాహనం ఆయన ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ట్రాక్టర్ బోల్తా పడింది.ఈ ప్రమాదంలో సోమల నాయక్‌కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆయనను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణమైన గుర్తు తెలియని వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు