శ్రీశైలం: సున్నిపెంట ఐటిఐ కళాశాలలో మరోసారి చిరుత సంచారం. భయాందోళనలో కళాశాల సిబ్బంది
శ్రీశైలం మండలం సున్నిపెంట ఐటీఐ కళాశాలలో చిరుత పులి కలకలం రేపింది. శ్రీశైలం మండలం సున్నిపెంటలోని ఐటీఐ కళాశాల ప్రాంగణంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. శనివారం ఉదయం చిరుత పులి కళాశాల కాంపౌండ్ గోడ దాటి లోపలికి ప్రవేశించి అక్కడ ఉన్న కళాశాల సిబ్బందికి కనిపించింది. ఒక్కసారిగా చిరుతను చూసిన సిబ్బంది భయాందోళనకు గురై వెంటనే అటవీ శాఖఅధికారులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న ఫారెస్ట్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకునేలోపే చిరుత పులి తిరిగి సమీప అడవిలోకి వెళ్లిపోయింది.ఈ నేపథ్యంలో ఐటీఐ కళాశాల పరిసర ప్రాంత ప్రజలు, సున్నిపెంట వాసులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.