మడకశిర మండలంలో అట్టహాసంగా ప్రారంభమైన ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్
మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో సోమవారం ఎల్ వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేవీపీ రామచంద్ర రావు తో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లా చెందిన పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆస్పత్రి యాజమాన్యం మాట్లాడుతూ ఈ ఆస్పత్రిలో 90% కంటికి సంబంధించి అన్ని రకాల చికిత్సలు ఇక్కడే పూర్తి అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి తో పాటు పలువురు ముఖ్యులు హాజరయ్యారు..