ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు లో 26 మంది బాధితులకు 9.68లక్షల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి
ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎమ్మిగనూరు పట్టణ వివిధ వార్డులకు చెందిన 26 మంది బాధితులకు రూ. 9.68 లక్షలు విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని 122 మంది బాధితులు రూ.1.12 కోట్ల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..