మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన (SIR) పై అవగాహన కార్యక్రమంలొ పాల్గొన్న MLA బుడ్డా
నేడు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పై అవగాహన కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు. జిల్లాకు చెందిన ఇతర ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగిపోకుండా పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే ప్రతి అర్హ ఓటరు పేరు జాబితాలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.