గుంతకల్లు: పామిడిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై ఆసుపత్రిలో దాడి, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కృష్ణారావుపై ఓ వ్యక్తి దాడి చేశాడు. బాధితుడు, పోలీసులు శుక్రవారం విలేకరులకు వివరాలు తెలిపారు. కృష్ణారావు మాట్లాడుతూ తాను అనంతపురం జిల్లా బొమ్మనహళ్ మండలం సింగనహళ్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నానన్నాడు. ఈ క్రమంలో నిన్న తన ఆరోగ్యం బాగాలేక పోవడంతో పామిడి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు మహేష్ దగ్గర వైద్యం కోసం వెళ్లగా మల్లికార్జున అనే వ్యక్తి దాడి చేశాడని అన్నారు.