నిర్మల్: నిర్మల్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జన మహోత్సవం
Nirmal, Nirmal | Sep 27, 2026 నిర్మల్ జిల్లా కేంద్రంలో మూడు రోజుల పాటు సాగిన గణేష్ నిమజ్జన ఉత్సవాలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. చివరి వినాయక ప్రతిమను వినాయకసాగర్ చెరువులో నిమజ్జనం చేయడంతో ఈ ఏడాది గణేశోత్సవాల సందడి ముగిసింది. భక్తులు భక్తిశ్రద్ధలతో విఘ్నేశ్వరుడికి వీడ్కోలు పలికారు.